: పోలీసు దొంగలు అడ్డంగా బుక్కయ్యారు... ఆ విగ్రహం ఖరీదు 3 కోట్లు
కంచే చేనుమేసింది. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా మారారు. ఒడిశాలోని పర్లాకిమిడి జిల్లా నారాయణపురంలో పంచలోహ విగ్రహాన్ని ముగ్గురు పోలీసులు, మరో ఇద్దరు అపహరించారు. 14 కేజీల బరువైన ఆ పంచలోహ విగ్రహం విలువ సుమారు 3 కోట్ల రూపాయలు ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దానిని నెల్లూరులో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.