: మోడీకి ఆస్ట్రేలియా ప్రధాని ధన్యవాదాలు
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బోట్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపి, జమ్మూకాశ్మీర్ వరదల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. మోడీకి ఫోన్ చేసిన టోనీ అబ్బోట్ గతవారం తన పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా కృషి చేయాలని కోరారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాను మరువలేనని అన్నారు. జమ్మూకాశ్మీర్ ను వదలు ముంచెత్తడం, అపారనష్టం వాటిల్లడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.