: తెలంగాణ పారిశ్రామిక విధానం రెడీ... ఇక పెట్టుబడుల వెల్లువే: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక విధానం సిద్ధమైందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాదులో నిర్వహించిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిశ్రామిక విధానంపై ముఖ్యమంత్రి తుది సమీక్ష పూర్తయిన తరువాత, తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ, ఫార్మా, బయోటెక్ రంగాల తరహాలోనే, ఏరోస్పేస్ రంగానికి హైదరాబాదును కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు వ్యవహారంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నామని ఆయన తెలిపారు. 250 కోట్ల పెట్టుబడులు దాటిన పరిశ్రమలకు ఏకగవాక్ష విధానంతో సంబంధం లేకుండా అనుమతులు ఇస్తామని ఆయన వివరించారు. ఇప్పటికే ఉన్న ఎరోస్పేస్ పార్కు కాకుండా, ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎలిమినేడు వద్ద ఒకటి, హైదరాబాదుకు ఉత్తరాన మరొక ఏరో స్పేస్ పార్కును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News