: గిటార్ దొంగకు రెండేళ్ల జైలు శిక్ష


ప్రముఖ సంగీతకారులు సంతకాలు చేసిన గిటార్ ను దొంగిలించినందుకు ఓ వృద్ధుడికి ఆస్ట్రేలియా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని బ్రిస్బేన్ హౌస్ ఆఫ్ మ్యూజిక్ నుంచి ఆమెరికన్ ర్యాక్ బ్యాండ్ ద ఈగల్స్, అమెరిక్ రచయిత, గాయకుడు చబ్బీ చెకర్, ఆస్ట్రేలియా గాయకుడు జిమ్మీ బార్నెస్ ల సంతకాలతో కూడిన ఓ గిటార్ ను మెర్వ్ ఫ్రెంచ్ (81) అనే వృద్ధుడు తస్కరించాడు. దీంతో దాని యజమాని పోలీసులను ఆశ్రయించాడు. గిటార్ ను మెర్వ్ వద్ద కనుగొన్న పోలీసులు దానిని యజమానికి అప్పగించారు. అయితే గిటార్ పై సంతకాలు చెరిగిపోవడాన్ని తట్టుకోలేకపోయిన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో దానిని శిక్షార్హమైన నేరంగా భావించిన స్థానిక కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, గిటార్ విలువ 30,000 అమెరికన్ డాలర్లు ఉంటుంది.

  • Loading...

More Telugu News