: భారత్ లో కాశ్మీర్ అంతర్భాగమని నిరూపిస్తాం: వెంకయ్యనాయుడు
కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని నిరూపిస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడమే బీజేపీ విధానమని అన్నారు. మావోయిస్టులు తుపాకీ తూటాలతో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేరనే విషయం గుర్తించాలని ఆయన సూచించారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన వెల్లడించారు. ప్రజలకు, ప్రభుత్వానికి పార్టీల కార్యకర్తలు వారధిలా ఉండాలని ఆయన తెలిపారు. బీజేపీని ఏపీలో దృఢం చేయాలంటే కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని ఆయన కర్తవ్యం బోధించారు.