: ఫేస్ బుక్ తో ఈ ప్రమాదం కూడా ఉంది!


సామాజిక అనుసంధాన వెబ్ సైట్లో అత్యంత క్రేజీ సైట్... ఫేస్ బుక్! దీనికి అభిమానులు కూడా ఎక్కువే. కొంత మంది ఫేస్ బుక్ లో అత్యధిక స్నేహితుల మోజుతో... ఫ్రెండ్ రిక్వెస్టు ఆమోదించాలంటూ వచ్చే ప్రతి రిక్వెస్టును ఓకే చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా రిక్వెస్టు పంపిన వ్యక్తి ఏ ఉద్దేశంతో రిక్వెస్టు పంపాడో నిర్ధారించుకున్న తరువాతే, అలాంటి రిక్వెస్టులు ఆమోదించాలని వారు సూచిస్తున్నారు. అలా కాకుండా, ఆటోమేటిక్ గా రిక్వెస్టు పంపారని, మీరూ ఆటోమేటిగ్గా ఆమోదిస్తే 'ఫిషింగ్' బారిన పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. 'ఫిషింగ్' అంటే ఆన్ లైన్లో జరిగే మోసాలు, స్కాములు. మోసగాళ్ళు వల విసిరితే అమాయకులు చిక్కుకోవడమన్నమాట. అలా హ్యాకర్లు ఫేస్ బుక్ లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారం దొంగిలించి, దాని ఆధారంగా స్కాములకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి వలలో పడేవారి యూజర్ నేమ్, పాస్ వర్డ్ దగ్గర్నుంచి క్రెడిట్ కార్డు వివరాల వరకు లాగేసే అవకాశముందని భారతీయ సంతతికి చెందిన పరిశోధకుడు అరుణ్ విశ్వనాథన్ హెచ్చరించారు. సోషల్ మీడియా విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News