: తెలంగాణలో రుణమాఫీకి సహకరించాలని బ్యాంకర్లను కోరిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకులను కోరారు. ఈ మేరకు బ్యాంకర్లతో ఈరోజు జరిగిన సమావేశంలో రుణమాఫీ, రైతులకు కొత్త రుణాలపై చర్చించారు. రుణాలు రీషెడ్యూల్ చేయండి, లేదా, బాండ్లు తీసుకోండని బ్యాంకు అధికారులకు చెప్పారు. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. స్పందించిన బ్యాంకర్లు... తాము సిద్ధమేనని, ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై చర్చించి చెబుతామన్నారు. మరోవైపు, రుణమాఫీపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం రేపు సమావేశం అవుతుంది.