: సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినంగా జరుపుకోండి: కోదండరాం పిలుపు
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర విలీనదినంగా జరుపుకోవాలని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ప్రభుత్వమే ప్రకటన చేస్తే బాగుండేదని అన్నారు. రేపు విలీన దినోత్సవాన్ని ప్రభుత్వపరంగా జరపాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే, ఈ అంశాన్ని మత కోణంలో చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.