: మంచి చేయమన్న వీసీని చితకబాదారు
మంచికి రోజులు లేవనేందుకు ఉదాహరణ ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. వీసీ జవహర్ లాల్ కౌల్ జమ్మూకాశ్మీర్ లో వరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని విద్యార్థులకు చెప్పి, వారికి సాయపడమన్నారు. జమ్మూకాశ్మీర్ కు చెందిన విద్యార్థులెవరైనా ఉజ్జయినిలో ఉంటే, ఇళ్ళ యజమానులు వారికి అద్దెనుంచి మినహాయింపునిచ్చి సహృదయత చాటుకోవాలని సూచించారు. అంతే, కొంత మంది యువకులు గుంపుగా వచ్చి వీసీపై పడి దుర్భాషలాడుతూ దాడి చేశారు. దీంతో, షాక్ కు గురైన వీసీ తీవ్రమైన గుండెనొప్పితో బాధపడ్డారు. దీనిని గమనించిన సిబ్బంది వీసీని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆ యువకులు ఆగ్రహంతో కంప్యూటర్లు తదితర సామగ్రి ధ్వంసం చేశారు. ఎనిమిదేళ్ల క్రితం ఇదే తీరున ఓ ప్రొఫెసర్ పై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. దీంతో, ఆయన షాక్ కు గురై గుండెపోటుతో మరణించారు.