: మంచినీళ్లడిగి...ముంచేశారు... తస్మాత్ జాగ్రత్త!


కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మంచినీళ్లు కావాలంటూ వచ్చి, ఆ ఇంటిని మొత్తం దోచేశారు. కడప జిల్లా రాయచోటిలోని కృష్ణాపురంలో తాగేందుకు నీరివ్వమని ముగ్గురు ఆగంతుకులు అడిగారు. ఎండబడలిక తీర్చుకోవడం కోసమే కదా అని భావించిన గృహిణి నీళ్ళ కోసం ఇంట్లోకి వెళ్లగానే, లోపలికి చొరబడిన ఆగంతుకులు ఆమెను ఇంట్లోనే కట్టేసి 30 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. అనంతరం ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా మంచినీళ్లడిగారా? అయితే, జాగ్రత్త వారి వాలకం గమనించండి, వారిని ఇంటి బయటే ఉంచి నీరివ్వండి, అంతే కానీ, తలుపులు బార్లా తెరచి వారిని లోపలికి ఆహ్వానించి నీరివ్వకండి.

  • Loading...

More Telugu News