: రూపాయి ఖర్చు లేకుండానే నందిగామలో మాకు ఓట్లు వచ్చాయి: రఘువీరా


నందిగామ అసెంబ్లీ స్థానం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన ఓట్లపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చు పెట్టకుండానే నందిగామలో తమ సంప్రదాయ ఓట్లు తమకు వచ్చాయన్నారు. టీడీపీ అభ్యర్థి గెలవడానికి తంగిరాల ప్రభాకరరావు కుటుంబంపై సానుభూతి, నామినేషన్ తర్వాత విజయవాడను రాజధానిగా ప్రకటించడం, ఇతర అంశాలు కారణమని పేర్కొన్నారు. అటు, వారి అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ డబ్బు ఖర్చుపెట్టిందని, మధ్యం సరఫరా చేశారని ఆరోపించారు. కానీ, తమ అభ్యర్థి వద్ద ఖర్చు పెట్టేందుకు డబ్బులేదన్నారు.

  • Loading...

More Telugu News