: రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయకేతనం
ఉత్తరాదిన జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. రాజస్థాన్ లో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కమలానికి నిరాశే ఎదురయింది. ఇక్కడ నాలుగు శాసనసభ స్ధానాలకు ఉపఎన్నికలు జరగ్గా బీజేపీ సిట్టింగ్ ప్రాంతాలైన సూరజ్ ఘర్, వీర్, నసీరాబాద్ లు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. కోట దక్షిణ స్థానం ఒక్కటే కాషాయ పార్టీ దక్కించుకుంది. గతేడాది డిసెంబర్ లో రాజస్థాన్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకుంది. మళ్లీ పది నెలల్లోపు జరిగిన ఉప ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజేకు ఎదురుదెబ్బనే చెప్పాలి.