: మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘనవిజయం... ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రభాకర్ రెడ్డి


మెదక్ లోక్ సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. 3,64,229 ఓట్ల భారీ మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ సందర్భంగా తనను భారీ మెజారిటీతో గెలిపించినందుకు మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని, కేసీఆర్ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచి తనకు ఓటు వేశారని తెలిపారు. మెదక్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుందని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News