: గుజరాత్ లో ఉపఎన్నిక ఫలితాల ప్రకటన... పుంజుకున్న కాంగ్రెస్
గుజరాత్ ఉపఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గుజరాత్ లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మిది స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. వీటిలో ఆరు స్థానాలను బీజేపీ గెలుచుకోగా... మూడు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. గత దశాబ్ద కాలంగా నరేంద్రమోడీ ప్రభావంతో గుజరాత్ లో బలహీనపడ్డ కాంగ్రెస్ కు... ఈ ఉపఎన్నిక ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. తన వంద రోజుల పాలనకు తీర్పుగా ఉపఎన్నికల ఫలితాలను భావిస్తానని గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఫలితాలకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.