: ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి... 2 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించిన టీఆర్ఎస్
మెదక్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ మెజార్టీ ప్రతి రౌండుకు పెరుగుతోంది. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు లక్షల పైచిలుకు మెజార్టీని సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయం కావడంతో... ఇప్పుడు అందరి దృష్టి మెజార్టీపై పడింది. సార్వత్రిక ఎన్నికలో కేసీఆర్ సాధించిన 3లక్షల 97వేల మెజార్టీని ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి దాటగలరా? లేదా? అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.