: గుజరాత్ లో కాస్త పుంజుకున్న బీజేపీ


గుజరాత్ ఉపఎన్నికల్లో బీజేపీ కాస్త పుంజుకుంది. మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు గుజరాత్ లో ఉపఎన్నికలు జరిగాయి. ఈ తొమ్మిది స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమై... రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయిన తర్వాత బీజేపీ ఐదు, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో, గుజరాత్ బీజేపీ వర్గాల్లో కాస్త నిరాశ ఆవహించింది. అయితే, కౌంటింగ్ ప్రక్రియ ఊపందుకున్న తర్వాత బీజేపీ కాస్త పుంజుకుంది. ప్రస్తుతం బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా... కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News