: లంచం కేసులో గుంటూరు సోషల్ వెల్ఫేర్ డీడీ అరెస్ట్
ప్రైవేట్ కళాశాల యాజమాన్యం నుంచి లంచం తీసుకుంటూ గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హనుమంత నాయక్, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. జిల్లాలోని ఓ ఫార్మసీ కళాశాల యాజమాన్యం నుంచి హనుమంత నాయక్, మంగళవారం ఉదయం రూ.1 లక్ష లంచం తీసుకున్నారు. బాధితుల నుంచి ముందుగానే సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు పక్కాగా వలపన్ని హనుమంత నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు.