: చెన్నై ఎయిర్ పోర్టులో మాదక ద్రవ్యాల కలకలం


చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం మాదక ద్రవ్యాల కలకలం రేగింది. కువైట్ వెళుతున్న ఓ వ్యక్తిని తనిఖీ చేసిన అధికారులు, రూ. 2 కోట్ల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మాదక ద్రవ్యాలు హెరాయిన్ రకానికి చెందినవిగా అధికారులు నిర్ధారించారు. మాదకద్రవ్యాలను తరలిస్తున్న వ్యక్తిని చిత్తూరు జిల్లాకు చెందిన ఆనంద్ గా గుర్తించారు. అయితే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి సోదాలు చేస్తున్నాయి. పట్టుబడిన ఆనంద్ ఇచ్చిన సమాచారం మేరకు మాదక ద్రవ్యాల నిరోధక విభాగం అధికారులు హడావిడిగా బయలుదేరారు.

  • Loading...

More Telugu News