: తాడిపత్రిలో హైటెన్షన్...ఎస్‌బీఐ బ్రాంచ్ లను ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు రెడీ!


నేడు తాడిపత్రిలో ఎస్‌బీఐ బ్రాంచ్ లను ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అన్యాయంగా కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ... మంగళవారం వేలమంది టీడీపీ కార్యకర్తలు, జేసీ అభిమానులు ఎస్ బీఐ బ్రాంచ్ లను ముట్టడిస్తున్నామని టీడీపీ నాయకుడు ఎస్వీ రవీంద్రారెడ్డి నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. తొలత దీన్ని ఆపేందుకు జేసీ మద్దుతుదారులతో పోలీస్ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అయితే, వారు ముట్టడిని విరమించుకోవడానికి ససేమిరా అనడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు ఉపక్రమించారు. దీనిపై సోమవారం రాత్రి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు సమావేశమయ్యారు. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని పోలీసులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పోలీసు బలగాలను రప్పించే పనిలో ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే, జేసీ మద్దతుదారులు చేపట్టిన బ్యాంకుల ముట్టడిని భగ్నం చేసేందుకు భారీఎత్తున పోలీసు బలగాలు నిన్న సాయంత్రం నుంచి తాడిపత్రికి వస్తున్నాయి. జేసీపై కేసు నమోదును అవమానకరంగా భావిస్తున్న ఆయన మద్దతుదారులు...ఎస్ బీఐ బ్రాంచ్ లను ముట్టడించేందుకు పక్కా వ్యూహాలతో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News