: కృష్ణవంశీ మంచి సినిమాలు తీస్తాడు కానీ..!: చిరంజీవి
'గోవిందుడు అందరి వాడేలే' సినిమా ఆడియో వేడుకలో చిరంజీవి మాట్లాడారు. దర్శకుడు కృష్ణవంశీ తన సినిమాల్లో కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తాడని కితాబిచ్చారు. కృష్ణవంశీ మంచి సినిమాలు తీస్తాడు కానీ.., అతని సినిమాలో నటించాలని తాను కోరుకోనని అన్నారు. ఆయన సినిమాలు మన నటనకు పరీక్ష పెడతాయని అన్నారు. తాను డ్యాన్సులు, యాక్షన్ కు పెద్దపీట వేస్తానని, కృష్ణవంశీ సినిమాల్లో నటన కనబర్చాల్సి ఉంటుందని, అందుకే భయపడ్డానని తెలిపారు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా కథ విన్న వెంటనే చరణ్ కు ఇది సరైన కథ అని అనిపించిందని అన్నారు.