: మరోసారి కామెడీ చేసిన బండ్ల గణేశ్


'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో వేడుకలో నిర్మాత బండ్ల గణేశ్ తనదైన శైలిలో మాట్లాడి అందరినీ నవ్వించారు. రామ్ చరణ్ వద్దకు వెళ్ళి 'డిల్లకు డిల్లకు' పాటకు డ్యాన్సు చేస్తూ, ఎలాగోలా ఆయనను లైన్లో పెట్టుకున్నాని తెలిపారు. చరణ్ ను లిటిల్ బాస్ గా అభివర్ణించిన గణేశ్... అతనితో సినిమా తీసేందుకు మూడేళ్ళపాటు తిరిగానని తెలిపాడు. కొరటాల శివతో పిక్చర్ ప్లాన్ చేసినా, కథ బాగోలేని కారణంగా అది ఆగిపోయిందని తెలిపాడు. సినిమా ఆగిపోవడంతో షాక్ తగిలినట్టయిందని అన్నాడు. బావిలో పడ్డా ఈదవచ్చు, చెరువులో పడితే ఒడ్డుకు రావచ్చు కానీ, బోరులో పడ్డట్టయిందని అనడంతో శిల్పకళావేదికలో నవ్వులు పూశాయి. ఆ తర్వాత తనకిచ్చిన మాట కోసం ఎనిమిది నెలలు ఖాళీగా ఉన్నాడని, తనతోనే సినిమా చేశాడని చెప్పాడు గణేశ్. 'మీరు చల్లగా ఉండాలి బాస్' అంటూ రామ్ చరణ్ ను ఉద్దేశించి అన్నాడు. రామ్ చరణ్ కు బడ్జెట్ పై ఎంతో శ్రద్ధ ఉందని తెలిపాడు. 'అమ్మా మీ కడుపున కోహినూర్ వజ్రం పుట్టింది. ఆ వజ్రం వెలుగులో మేమంతా ప్రకాశిస్తూ ఉంటాం' అని రామ్ చరణ్ తల్లి సురేఖను ఉద్దేశించి పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News