: హైదరాబాద్ హజ్ హౌస్ వద్ద తెగిపడిన విద్యుత్ తీగలు... నలుగురి మృతి
హైదరాబాదు నాంపల్లిలోని హజ్ హౌస్ సమీపంలో ఉన్న బస్ స్టాపు వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దీంతో, మధ్యప్రదేశ్ కు చెందిన నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా జిమ్మీ సర్కస్ కు చెందిన వారని తెలుస్తోంది.