: నాకు ప్రాణహాని ఉంది: భద్రత తొలగింపుపై హైకోర్టులో జగన్ పిటిషన్
తనకు భద్రత తొలగించడంపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. భద్రత పునరుద్ధరించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కారణాలతోనే భద్రత తొలగించారని ఆరోపించారు. మావోయిస్టులు, అనంతపురం జిల్లాలోని కొందరు వ్యక్తుల కారణంగా తనకు ప్రాణహాని ఉందని, అందుకే, తనకు జడ్ కేటగిరీ భద్రతను పునరుద్ధరించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు.