: విశాఖ బాలుడి కిడ్నాప్ మిస్టరీ వీడింది
విశాఖపట్నం పెందుర్తి మండలం లక్ష్మీపురంలో వారం క్రితం కిడ్నాప్ కు గురైన దామోదర్ అనే పదేళ్ళ బాలుడు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డాడు. బాలుడిని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ కొండపై గదిలో బంధించిన కిడ్నాపర్లు పెద్దమొత్తంలో నగదు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ కిడ్నాపర్ గోపాలపట్నంలోని కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేస్తుండగా పోలీసులు వలపన్ని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారంతో మరో కిడ్నాపర్ ను అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.