: 'ఆగడు' సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్!


మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా ప్రచారాన్ని నిర్మాతలు వినూత్న రీతిలో చేస్తున్నారు. అందులో భాగంగా 'ఆగడు సూపర్ స్టార్ ఎక్స్ ప్రెస్' పేరిట హైదరాబాదు నుంచి విశాఖ వరకు వెళ్లే ఓ ట్రైన్ కు పోస్టర్లు అంటించారు. ఈ ట్రైన్ నెల రోజుల వరకు 'ఆగడు ఎక్స్ ప్రెస్' గా కొనసాగుతుందని నిర్మాతలు తెలిపారు. ఇందుకోసం 19 మంది మహేష్ ఫ్యాన్స్ ను ఎంపిక చేసి చిత్ర యూనిట్ తో కలిపి వైజాగ్ తీసుకువెళతామని చెప్పారు. గెలుపొందిన వారికి 'ఆగడు' కిట్స్ బహుమతిగా ఇస్తామని వెల్లడించారు. ఈ ట్రయిన్ లో వెళ్లాలనుకునే వారు 14reelscontest@gmail.comకి పేరు, అడ్రస్, మొబైల్ నంబర్ ఇతర వివరాలు పంపాల్సి ఉంటుంది. ఈ నెల 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

  • Loading...

More Telugu News