: 'భారతరత్న'కు మాజీ ప్రధాని పీవీ పేరు ప్రతిపాదన


దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. 'పద్మ విభూషణ్' కు ఆచార్య జయశంకర్, 'పద్మభూషణ్' కు ఆచార్య జి.రామిరెడ్డి పేర్లను ప్రభుత్వం సిఫారసు చేస్తుందట. 'పద్మశ్రీ' అవార్డుకు కూడా కొంతమంది పేర్లను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల్లో ఈ జాబితాపై సీఎం ఆమోద ముద్ర వేశాక కేంద్రానికి పంపనున్నారు.

  • Loading...

More Telugu News