: ఐఎండీబీలో 'క్వీన్' చిత్రానికి టాప్ రేటింగ్
బాలీవుడ్ లో ఈ ఏడాది ఘన విజయం సాధించిన 'క్వీన్' తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ చిత్రం 10కి గానూ 8.6 శాతం రేటింగ్ ను దక్కించుకుంది. దాంతో, అత్యధిక రేటింగ్ దక్కించుకున్న భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 1975లో అమితాబ్ బచ్చన్-ధర్మేంద నటించిన 'షోలే' కూడా ఇదే రేటింగ్ (8.6) ను పొందింది. దీనిపై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉందని తెలిపింది. వికాస్ బాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 7న విడుదలై సక్సెస్ సాధించింది.