: తొలి ఇ-కేబినెట్ సమావేశం ముగిసింది
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటలకు పైగా మంత్రి వర్గ సమావేశం కొనసాగింది. వందరోజుల పాలన... మంత్రుల పనితీరు తదితర విషయాలపై కేబినెట్ చర్చించింది. దేశంలోనే తొలి ఇ-కేబినెట్ సమావేశంగా ఈ భేటీ చరిత్ర సృష్టించింది. తొలిసారిగా కాగిత రహిత కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఏపీ సర్కార్ అందరినీ ఆశ్చర్యపరిచింది.