: సర్వే చేయడానికి వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడి చేసిన గ్రామస్తులు
వరంగల్ జిల్లా ఘనపురం మండలం గాంధీనగర్ లో ప్రస్తుతం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో గ్రామం ఉందని సమాచారం తెలియడంతో... సర్వే చేయడానికి తహశీల్దార్, రెవెన్యూ సిబ్బంది ఈ ఉదయం గ్రామానికి వెళ్లారు. అయితే, గ్రామస్తుల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఎట్టి పరిస్థితుల్లోను సర్వే జరగనివ్వబోమని గ్రామస్తులు రెవెన్యూ సిబ్బందిని అడ్డుకున్నారు. అయితే, సర్వే చేయడానికి రెవెన్యూ సిబ్బంది ఉపక్రమించడంతో.... గ్రామస్తులు వారిపై దాడి చేశారు. దీంతో, రెవెన్యూ సిబ్బంది అక్కడి నుంచి పరుగులెత్తారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి విషమంగా ఉంది.