: ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకున్న కేసీఆర్


అనునిత్యం రాజకీయాలు, వ్యూహ ప్రతివ్యూహాలు, అధికారిక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపే కేసీఆర్ కాస్త మానసిక బడలిక తీర్చుకునేందుకు ఆదివారం తన ఫాంహౌస్ లో పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. శనివారం మెదక్ ఉపఎన్నిక సందర్భంగా... సిద్ధిపేట మండలంలోని తన స్వగ్రామమైన చింతమడకలో కేసీఆర్ ఓటు వేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు ఫాంహౌస్ కు చేరుకున్నారు. ఆదివారం రోజంతా ఫాంహౌస్ లోనే గడిపి పంటలకు సంబంధించిన వివరాలను ఫాంహౌస్ నిర్వాహకుడు జహంగీర్ ను అడిగి తెలుసుకున్నారు. మనవడు హిమాన్షు(కేటీఆర్ కుమారుడు)తో రోజంతా ఆయన కాలక్షేపం చేశారు. ఆదివారం సాయంత్రం పొద్దుపోయాక హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు.

  • Loading...

More Telugu News