: హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతా భావం ఉందనడం అవాస్తవం: గవర్నర్


ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సీమాంధ్రులకు అభద్రతా భావం ఉందని అనడం అవాస్తవమని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ... సెక్షన్లు 9, 10పై ఎలాంటి వివాదం లేదని, వీటిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. ఈ ఉదయం హస్తిన చేరుకున్న గవర్నర్ ముందుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి విజన్ తో పనిచేస్తున్నారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News