: భూముల ధర విషయంలో విజయవాడ న్యూయార్క్ స్థాయికి చేరుకున్నట్టుంది: వెంకయ్య
భూముల ధర విషయంలో విజయవాడ... న్యూయార్క్ స్థాయికి చేరుకున్నట్టుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అడ్డదిడ్డంగా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేసిన రియల్టర్లు కచ్చితంగా ఏదో ఒకనాడు బోర్లా పడతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రజలకు అంత కొనుగోలు శక్తి లేదని రియల్టర్లు తెలుసుకోవాలన్నారు. దళారుల మాయలో పడి భూముల కొనుగోలు విషయంలో ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు. శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతానికి వెళ్తే... ఆ ప్రాంతంలో భూముల ధరలకు ఇష్టం వచ్చినట్లు రెక్కలొచ్చేశాయని ఆయన విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన గొప్ప 'మేలు' అదేనన్నారు.