: ఆరోపణలపై ఘాటుగా స్పందించిన రేణూ దేశాయ్


పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పవన్ కల్యాణ్ పేరు ఉపయోగించుకుంటోందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించింది. పవన్ ను పెళ్ళాడకముందే తాను నటినని, సుప్రసిద్ధ మోడల్ నని ట్విట్టర్లో పేర్కొంది. గతేడాది ఎవరి సహాయం లేకుండానే సొంతంగా హిట్ సినిమా తీశానని, పవన్ పేరు వాడుకోవాల్సిన అవసరం తనకు లేదని తెలిపింది. తనపై వ్యాఖ్యలు చేసేందుకు ఉపయోగించే శక్తిని మరేదైనా సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తే మంచిదని హితవు పలికింది. పవన్ కల్యాణ్ పై అభిమానం ఉంటే మంచిదేనని, ఆ అభిమానంతో ఇతరులను ఇబ్బంది పెట్టే మెసేజ్ లు పంపడం సరికాదని ట్వీట్ చేసింది.

  • Loading...

More Telugu News