: త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ 'యువజన విభాగం'


ఆమ్ ఆద్మీ పార్టీ 'యువజన విభాగం' ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ నెల 27న భగత్ సింగ్ 107వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ విభాగాన్ని ప్రారంభించబోతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు న్యూఢిల్లీలోని పలు చోట్ల పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు యూత్ వింగ్ ప్రణాళిక చేసింది. గత నెలలో మహిళా విభాగం నెలకొల్పిన తర్వాత ఆప్ ఈ విభాగాన్ని నెలకొల్పనుండటం విశేషం. మహిళా రక్షణ, నిరుద్యోగం, దేశంలోని యువత, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై ఈ విభాగం దృష్టి పెడుతుంది. 35 ఏళ్ల లోపు వారు ఈ యువజన విభాగంలో పేర్లను నమోదు చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News