: ఐఎస్ఐఎస్ కు దూరంగా ఉండండి: బ్రిటన్ ముస్లింలకు ఇంగ్లండ్ క్రికెటర్ విజ్ఞప్తి
ఇద్దరు అమెరికా జర్నలిస్టులను, ఓ బ్రిటీష్ జాతీయుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన ఐఎస్ఐఎస్ గ్రూపుకు దూరంగా ఉండాలని బ్రిటన్ ముస్లింలకు ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ విజ్ఞప్తి చేశాడు. ఇలాంటి ఘాతుకాలను ఇస్లాం సమర్థించదని అలీ స్పష్టం చేశాడు. 'హఫింగ్ టన్' పోస్ట్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఐఎస్ఐఎస్ దురాగతాలను ఇస్లాం ఖండిస్తుందని, ముస్లింలుగా మనం సహనం పాటించాలని ఈ పాకిస్థాన్ సంతతి క్రికెటర్ పిలుపునిచ్చాడు. ఇటీవలే భారత్ తో టెస్టు సందర్భంగా 'సేవ్ గాజా' రిస్ట్ బ్యాండ్ ధరించి మొయిన్ అలీ వార్తల్లోకెక్కడం తెలిసిందే.