: విజయవాడ నగరపాలక సంస్థ దుస్థితి చూస్తే బాధ కలుగుతోంది: వెంకయ్య నాయుడు


విజయవాడ నగర పాలక సంస్థ దుస్థితి చూస్తే బాధ కలుగుతోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. రెండు నెలలుగా ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో విజయవాడ నగర పాలక సంస్థ ఉందన్నారు. మెరుగైన పరిపాలన వ్యవస్థ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమని ఆయన అన్నారు. పన్నులు వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నగరపాలక సంస్థకు పరోక్షంగా ఆయన సూచించారు. ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనులు చేస్తే.. ప్రజలు కచ్చితంగా పన్నులు కడతారని ఆయన అన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే పన్నులు కట్టడానికి ప్రజలు వెనుకాడరన్నారు. సరైన ప్రణాళిక ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. విజయవాడలో 'స్మార్ట్ సిటీస్'పై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. వీజీటీఎం మెట్రో రైల్ తన కల అని వెంకయ్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News