: మహారాష్ట్ర సీఎం... ఐసీయూలో ఉన్న రోగి: శివసేన


శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ పత్రిక ‘సామ్నా’ ఘాటుగా స్పందించింది. ‘‘చవాన్ ఐసీయూలో చికిత్స పొందుతున్న స్పృహలో లేని రోగిలా అర్థపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు’’ అంటూ ఆ పత్రిక ప్రతిస్పందించింది. ఆజ్ తక్ ఛానల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహారాష్ట్ర సీఎం, ఉద్ధవ్ ను పాలనా అనుభవం లేని వ్యక్తిగా అభివర్ణించారు. 1995లో బీజేపీతో కలిసి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఉద్ధవ్ ప్రభుత్వంలో చోటు దక్కించుకోలేకపోయారని ఆరోపించారు. చవాన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సామ్నా, 'ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటికి చవాన్ కు ఏం అనుభవం ఉంది?, రాజీవ్ ప్రధానిగా పీఠమెక్కిన నాడు ఆయనకు ఎలాంటి అనుభవం ఉంది?' అంటూ విరుచుకుపడింది.

  • Loading...

More Telugu News