: ఐదు నిమిషాలుంటే... వరదల్లో కొట్టుకుపోయేవాళ్లమే: 'ఇగ్నో' వీసీ అస్లాం


‘‘మేం బస చేస్తున్న అతిథి గృహంలోకి వరద నీరు చేరిపోతోంది. వాచ్ మన్ హెచ్చరికతో భవనం పైకి చేరాం. అప్పటికీ సెల్ ఫోన్ లు పనిచేస్తున్నాయి. వెంటనే స్నేహితుడికి ఫోన్ చేసి తనను, తన కుటుంబాన్ని రక్షించమని కోరాను. వెంటనే పోలీసు అధికారిగా పనిచేస్తున్న తన కొడుకుతో వచ్చిన స్నేహితుడు మమ్మల్ని తమ వాహనంలోకి ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు. మేం అటు వెళ్లామో, లేదో... గెస్ట్ హౌస్ ను వరద నీరు ముంచెత్తించింది. స్నేహితుడు రావడం ఐదు నిమిషాలు ఆలస్యమై ఉంటే, భార్య, కూతురు సహా అంతా వరద నీటిలో కొట్టుకుపోయే వారమే’’నంటూ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ వీసీ మొహ్మద్ అస్లాం తాను కాశ్మీర్ లో ఎదుర్కొన్న భయానక పరిస్థితిని వివరించారు. బంధువుల పెళ్లి కోసం కాశ్మీర్ వెళ్లిన అస్లాం కుటుంబం ఆరు రోజుల తర్వాత ఎట్టకేలకు శనివారం ఢిల్లీ చేరుకుంది. అయితే, కొత్తగా పెళ్లి చేసుకున్న తన బంధువుల పరిస్థితి ఏమిటో ఇప్పటికీ తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో కాశ్మీర్ ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలపై ఆయన విరుచుకుపడ్డారు. సునామీ సందర్భంగానూ కేవలం ఆరు రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కాశ్మీర్ లో పది రోజులు గడుస్తున్నా, పరిస్థితి మరింత విషమంగానే ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News