: ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీకాకుళంలో చంద్రబాబు పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17, 18 తేదీల్లో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. నాగావళి, వంశధార వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన ఈ సందర్భంగా పరిశీలిస్తారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ప్రభుత్వ, అభివృద్ధి పథకాల కార్యక్రమాలకు అధికారులు తుది రూపు ఇవ్వనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు.