: రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న టీడీపీ...నిరంతర విద్యుత్తుపై రేపు కేంద్రంతో ఒప్పందం


తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రేపటితో 100 రోజులు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓ అపురూప కానుక ఇవ్వనుంది. నిరంతర విద్యుత్ సరఫరా (24x7) పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రంతో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. అనుక్షణం నాణ్యమైన, మెరుగైన విద్యుత్తు సరఫరాతో దేశంలోనే ఏపీ త్వరలో అన్నిరంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తుందని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. అందరికీ విద్యుత్తును అందించే 'నిరంత (24x7) విద్యుత్తు సరఫరా పథకం’ తన కల అని, విద్యుత్తు రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళతానని చంద్రబాబు చెప్పారు. నిరంతర (24x7) విద్యుత్తు సరఫరా పథకం వల్ల రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చంద్రబాబు అన్నారు. మెరుగైన విద్యుత్తును అందించడంవల్ల పరిశ్రమలు, వాణిజ్య సముదాయాల వృద్ధి కారణంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని...దీని వల్ల ఆర్థిక పురోభివృద్ధి త్వరగా సాధిస్తామని తెలిపారు. ఈ ఒప్పందంతో సంబంధం లేకుండానే... ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల విద్యుత్ సరఫరా బాగా మెరుగుపడింది. పట్టణాలలో ఇప్పటికే 24x7 విద్యుత్ ను సరఫరా చేస్తుండగా... పల్లెటూళ్లలో కూడా కరెంట్ కోతలు బాగా తగ్గాయి.

  • Loading...

More Telugu News