: సోనియా, అమిత్ షాలకు సమాచార కమిషన్ తాఖీదులు
రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధి కిందకు తెచ్చినా, వాటిని అమలు చేయడం లేదేమిటని కేంద్ర సమాచార కమిషన్ పలు రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఈ తాఖీదులందుకున్న వారిలో అధికార బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు. తమ ఆదేశాలు అమలు చేయని మీపై దర్యాప్తునకు ఎందుకు ఆదేశించరాదో తెలియజేయాలంటూ ఆ నోటీసుల్లో కేంద్ర సమాచార కమిషన్ సంజాయిషీ కోరింది. ఈ నోటీసులందుకున్న పార్టీల్లో ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలు కూడా ఉండటం గమనార్హం.