: ఎమ్మెల్యే పువ్వాడపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులను ఆశ్రయించిన అజయ్, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అజయ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నగరంలోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్న వెంకటేశ్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని గుర్తించారు. నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.