: హిందూ మహా సముద్రంలో మలేసియా విమాన శకలాలు?
239 మంది ప్రయాణీకులతో గగన తలంలోకి ఎగిరిన మలేసియా విమానం కనిపించకుండా పోయి దాదాపు ఆరు నెలలవుతోంది. ఇప్పటిదాకా ఆ విమానం ఎక్కడ కూలిపోయింది, అసలు ఏ కారణాల చేత విమానం అదృశ్యమైందన్న అంశం మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ విమానం కోసం మలేసియా సహా, పలు దేశాలు విస్తృతంగా చేపట్టిన గాలింపు చర్యలు కూడా ఫలితాలను ఇవ్వలేదు. తాజాగా హిందూ మహా సముద్రంలో మలేసియా విమాన విడి భాగాలుగా అనుమానిస్తున్న 58 శకలాలను ఆస్ట్రేలియా బృందం గుర్తించింది. అయితే, ఈ శకలాలు మలేసియా విమానానివా? కాదా? అన్న విషయం తేలాల్సి ఉందని మలేసియా రవాణా శాఖ మంత్రి లూయీ తియాంగ్ లాయీ చెప్పారు. ఈ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా గల్లంతైన సంగతి తెలిసిందే.