: అఘాయిత్యం... ఆపై విష ప్రయోగం: యూపీలో మృగాళ్ల అకృత్యం


అత్యాచారాలకు నెలవైన ఉత్తరప్రదేశ్ లో మృగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండాపోతోంది. మహిళలు, బాలికలన్న తేడా లేకుండా రెచ్చిపోతున్న కామాంధులు, తమపై నేరాలు నమోదు కాకుండా ఉండేందుకు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో అఘాయిత్యం చేసిన తర్వాత బాధితులను హతమారిస్తే, ఆధారాలు లేకుండా పోతాయి కదా అని భావిస్తున్న మగాళ్లు, అత్యాచారాలతో పాటు హత్యలకూ తెగబడుతున్నారు. ఇక బయటికెళ్లిన మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడిన యూపీ మృగాళ్లు ఏకంగా బాధితుల ఇళ్లలోకే ప్రవేశించి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ తరహా ఘటన అలహాబాద్ లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటిలో నిద్రిస్తున్న బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నలుగురు యువకులు, ఆపై ఆమెతో విషం తాగించారు. ఇంటిలో సోదరుల పక్క గదిలో నిద్రిస్తున్న బాలిక వద్దకు చాకచక్యంగా చేరుకున్న నలుగురు కీచకులు, ఆమెపై సామూహిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెతో బలవంతంగా విషం తాగించి పరారయ్యారు. బాలిక కేకలతో మేల్కొన్న కుటుంబ సభ్యులు, ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆ బాలిక తుది శ్వాస విడిచింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాలిక కుటుంబ సభ్యులకు నిరాశే ఎదురైంది. దీంతో విషయం తెలుసుకున్న బాలిక గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ధర్నాతో ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News