: మణిపూర్ ఇమేజ్ ను స్థానిక విద్యార్థులు డ్యామేజ్ చేస్తున్నారు: మణిపూర్ సీఎం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులపై మణిపూర్ స్థానిక విద్యార్థులు చేసిన దాడుల విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. మణిపూర్ నిట్ క్యాంపస్ చుట్టూ సీఆర్ పిఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరించింది. అలాగే, సంఘటన గురించి తెలిసిన వెంటనే నిట్ క్యాంపస్ కు మణిపూర్ సీఎం హుటాహుటిన చేరుకున్నారు. దీనికి బాధ్యులైన విద్యార్థులను క్యాంపస్ నుంచి బహిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది...ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారని... దీని వల్ల మణిపూర్ ఇమేజ్ దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చాలా చురుగ్గా వ్యవహరించాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా తెలుగువారికి ఏ కష్టం వచ్చినా వెంటనే సహాయసహకారాలు అందేలా చూస్తోన్న కంభంపాటి రామ్మోహన్ రావు ఈ విషయంలో మరోసారి సమర్థంగా పనిచేశారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే...కేంద్ర హోంశాఖ అధికారులను అలర్ట్ చేయడంతో పాటు...మణిపూర్ సీఎంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ... తెలుగు విద్యార్థులకు వెంటనే భద్రత కల్పించేలా ఆయన ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులందరనీ ప్రత్యేకంగా ఓ హాస్టల్ లో ఉంచేలా కూడా కంభంపాటి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా మణిపూర్ డీజీపీతో మాట్లాడారు.