: ఐరాసలో మోడీ ప్రసంగం హిందీలోనే: రాజ్ నాథ్


ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ హిందీలోనే ప్రసంగించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సాధారణంగా ప్రపంచ దేశాల అధినేతలు పాల్గొనే ఆ సమావేశంలో అందరూ ఆంగ్లంలోనే ప్రసంగిస్తారు. ఈ సమావేశానికి హాజరైన భారత ప్రధానులు కూడా ఆంగ్లంలోనే ప్రసంగించారు. అయితే అందరికంటే భిన్నంగా వ్యవహరించే నరేంద్ర మోడీ, ఆ సమావేశంలో హిందీలో ప్రసంగించేందుకు నిర్ణయించుకున్నారని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. హిందీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

  • Loading...

More Telugu News