: ఎంబీఏ విద్యార్థులకు ఆ నాలుగు దేశాల తర్వాత మనమే!


ఎంబీఏ... మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్! ఈ డిగ్రీ ఎవర్ గ్రీన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా విద్యారంగ నిపుణులు చెప్పేమాట. ప్రతి రంగంతోనూ ఈ రంగం ముడిపడి ఉండడమే అందుక్కారణం. మేనేజ్ మెంట్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ఎంబీఏ వైపు మొగ్గు చూపుతున్న విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, నాణ్యమైన ఎంబీఏ విద్య కోసం యువత విదేశాల బాటపడుతోంది. ఈ విషయమై ఎంబీఏ.కామ్ ఓ సర్వే చేపట్టింది. ఎంబీఏ విద్యాభ్యాసం కోసం విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల విషయానికొస్తే... భారత్ ఐదోస్థానంలో ఉండడం విశేషం. ఈ జాబితాలో అమెరికా, యూకే, కెనడా, ఫ్రాన్స్ దేశాలు తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక, భారత్ తర్వాతి స్థానాల్లో హాంకాంగ్, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. కోర్సు సమయంలో విద్యార్థికి అందే ఆర్ధిక సహకారం, ట్యూషన్ ఫీజులు వంటి అంశాల ప్రాతిపదికన ఈ జాబితా రూపొందించారు.

  • Loading...

More Telugu News