: కంటోన్మెంట్ లో మిలిటరీ ఆంక్షలను ఎత్తివేయిస్తాం: ఎంపీ మల్లారెడ్డి


సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్, ఏవోసీ పరిధిలో నిత్యం వాహన రాకపోకలపై మిలిటరీ ఆంక్షలు కొనసాగుతూనే ఉంటాయి. అవసరం ఉన్నా, లేకపోయినా, ఇదో తంతులా కొనసాగుతోంది. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే ప్రజలకు ఏడాది పొడవునా ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని సందర్భాల్లో ఆంక్షలు అవసరమని భావించినా, నిత్యం ఆంక్షలు విధించడంపై పలు సందర్భాల్లో పెద్ద ఎత్తున వివాదాలు కూడా చెలరేగాయి. అయితే, ఈ ఇబ్బందులకు చెక్ పెట్టేస్తానంటున్నారు మల్కాజిగిరి ఎంపీ, పార్లమెంట్ లో రక్షణ శాఖ స్థాయి సంఘం సభ్యుడు మల్లారెడ్డి. మిలిటరీ ఆంక్షలతో వేగలేకపోతున్నామంటూ ఆదివారం తనను కలిసిన మల్కాజిగిరి ప్రజలకు ఎంపీ ఈ మేరకు హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ భేటీలో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు వాస్తవ పరిస్థితులను కేంద్రానికి వివరించి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News