: ఇసిస్ (ఐఎస్ఐఎస్)పై యుద్ధంలో అస్ట్రేలియా సైనిక బలగాలు!


ఇరాక్, సిరియాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లపై అమెరికా ప్రకటించిన యుద్ధంలో ఆస్ట్రేలియా బలగాలు కూడా కదన రంగంలోకి దూకుతున్నాయి. మధ్య తూర్పు ఇరాక్ లో జరిగే యుద్ధంలో ఆస్ట్రేలియా బలగాలు ఇస్లామిక్ తీవ్రవాదులను తరిమికొట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఆదివారం ప్రకటించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులపై యుద్ధం ప్రకటించిన అమెరికా విన్నపం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అబాట్ వెల్లడించారు. ఇరాక్ లో 'ఇసిస్' తీవ్రవాదులపై పోరాటంలో ఆస్ట్రేలియాకు చెందిన 600 మంది సుశిక్షిత సైనికులతో పాటు అత్యంత శక్తి సామర్థ్యాలతో ప్రత్యర్థిని బెంబేలెత్తించే ఎనిమిది వైమానిక దళాలు పాల్పంచుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News