: కాశ్మీర్లో మళ్ళీ వర్షాలు... ప్రజలను వణికిస్తున్న వరద భయం
గతకొన్ని రోజులుగా వరదలతో అతలాకుతలమైన జమ్మూకాశ్మీర్ లో మళ్ళీ వర్షాలు ఆరంభమయ్యాయి. దీంతో, అక్కడ కొనసాగుతున్న సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. అటు, మరోసారి వరదలు ముంచెత్తుతాయేమోనన్న భయాందోళనలు ప్రజలను వెంటాడుతున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలతో జీలం నది మరోసారి ఉగ్రరూపం ప్రదర్శించేందుకు సిద్ధమైంది.